ఆంధ్రప్రదేశ్ అల్లూరుజిల్లా త్రినేత్రం న్యూస్ అనంతగిరి మండలం: ఏప్రిల్ 24 : జమ్మూకశ్మీర్‌లోని పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ మేరకు జనసేన మండల అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో అనంతగిరి మండలంలో కూడా మానవహారం నిర్వహించారు.
జనసేన పార్టీ ప్రకటనలో, ఈ దాడికి పూర్తి బాధ్యత అక్కడి రాష్ట్ర ప్రభుత్వానిదని, కేంద్రమూ బాధ్యత వహించాల్సిందని పేర్కొన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ అని హేళన చేశారు.
పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, జనసేన కార్యాలయాల్లో మూడు రోజుల పాటు పార్టీ జెండాలను అవనతం చేయనున్నారు. అలాగే, ప్రధాన కూడళ్ళలో మానవహారాలు ఏర్పాటు చేసి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపనున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కొర్ర రవి, పాంగి లక్ష్మణ్, వంతల శ్రీను, ఎస్ రామారావు, కిల్లో బుజ్జి బాబు, గుమ్మడి రాంబాబు, గణేష్, డానీ, సాయి కుమార్, జన్ని లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజలను ఈ మానవహారాల్లో పాల్గొని, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలపాలని వారు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


