వేగుళ్ళ లీలా కృష్ణ ఆద్వర్యంలో
కొవ్వుతుల ర్యాలీ…
పెహల్గాం మృతులకు నివాళి…
దేశ ద్రోహులను ఏరివేత చేపట్టాలి….
Trinethram News : మండపేట : త్రినేత్రం న్యూస్. జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతం
పెహల్గాం ఉగ్రవాద దాడిలో మృతులకి సంతాప సూచకంగా బుధవారం కొవ్వూతుల ర్యాలీ నిర్వహించారు . మండపేట కలువపువ్వు సెంటర్ వద్ద మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముంబైలో 2008లో జరిగిన మారణహోమం తరువాత పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాద ఘటన భారత్‌ను ఉలిక్కిపడేలా చేసిందన్నారు. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావడానికి కాస్త ముందుగా నలుగురు సాయుధ ముష్కరులు 26 మంది టూరిస్టులను పహల్గాంలో పొట్టనపెట్టుకోవడం అమానుషమని పేర్కొన్నారు. ఈ మారణహోమానికి కారకులైన ముష్కరులను మట్టుపెట్టేందుకు భద్రత బలగాలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయన్నారు. వేలాది మంది సాయుధ పోలీసులు, భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌ను జల్లెడ పడుతున్నారనీ పేర్కొన్నారు. ఇది భయంకరమైన, విషాదకరమైన ఉగ్రవాద దాడి గా పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరమైన, దిగ్భ్రాంతికరమైన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో అమాయక ప్రజలను చంపడం చాలా దుర్మర్గమైన, అమానుషమైన చర్య అన్నారు. వేగుళ్ళ లీలా కృష్ణ మాట్లాడుతూ దేశ ద్రోహులను ఏరివేత చేపట్టాలన్నారు.పౌర సమాజంలో ఉగ్రవాదానికి చోటు లేదని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా మృుతుల కుటుంబాలకు సంతాపం తెలియజేయాలని పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానవీయమని అవేదన వ్యక్తం చేశారు.ఎంతమాత్రం సహించరాదని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాప సూచకంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు సంతాప దినాలను జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారన్నారు. ఉగ్రవాద దుశ్చర్యలతో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇరువురి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం భరోసా నిలుస్తుందని చెప్పారు. భారతదేశ ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నంచేయలేదని పేర్కొన్నారు. అందరూ ఏకతాటిపై నిలిచి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రథం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయం మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, బిజెపి ఉపాధ్యక్షులు కొన సత్యనారాయణ, మండపేట నియోజక వర్గ బిజెపి కన్వీనర్ కోటిపల్లి సాయి రామ్, కో కన్వీనర్ కంకటాల మురళీ కృష్ణ, టౌన్ టిడిపి అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మైనార్టీ నాయకులు ఎండి అతవూరు రెహమాన్, ఎండి కరీం ఖాదారీ, కౌన్సిలర్ కాసిన కాశీ విశ్వనాథ్, జనసేనా టౌన్ అద్యక్షులు నామాల చంద్రరావు, మండపేట మండల జన సేన అధ్యక్షులు కుంచె దుర్గా ప్రసాద్, రాయవరం జానసేనా అద్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, జిల్లా జన సేన ప్రధాన కార్యదర్శి సారకుల అబ్బులు, జిల్లా జన సేన సంయుక్త కార్యదర్శి దాల పర్తి శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, మామిడాల మనో కృష్ణ, గెడ్డపు కిరణ్, రామిసెట్టి రాజా , బొమ్మన సతీష్ కూటమి నాయకులు, బిజెపి, టిడిపి, జన సేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


