త్రినేత్రం న్యూస్ : అనపర్తి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రస్థాయి మరియు జిల్లాస్థాయి లో మొదటి స్థానంలో ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించి, నగదు బహుమానం అందచేసిన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన రుత్తల మణికంఠ గారి భార్య శ్రీమతి రుత్తల లీలా శ్రావణి కి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం జరిగింది.
బిక్కవోలు మండలం పందలపాక గ్రామానికి చెందిన పొలమూరి శివయ్య మరియు శ్రీమతి వెంకటరత్నం దంపతుల కుమార్తె దేవి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో జిల్లా మొదటి స్థానం రావడం జరిగింది.
విద్యార్థులకు పందలపాక గ్రామం వైయస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు సమకూర్చిన నగదు రుత్తల లీలా శ్రావణి కి 5000 ,పొలమూరి దేవి కి 2500 నగదు బహుమానం అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సబ్బెళ్ళ కృష్ణారెడ్డి గారు ( అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు), సత్తి హరి ప్రసాద్ రెడ్డి (గ్రామ శాఖ అధ్యక్షులు), కర్రి గీతా సతీష్ కుమార్ (ఎంపిటిసి 1), మచ్చా పాప(ఎంపీటీసీ 2), బొడ్డు ముత్యాలరావు, పడాల దుర్గారెడ్డి (అనపర్తి నియోజకవర్గం గ్రీవెన్స్ అధ్యక్షులు), గొలుగూరి అబ్బు, కర్రీ ఇస్రారెడ్డి, పాలచర్ల అబ్బు, వంకా శ్రీను, యాసలపు శ్రీనివాస్, రొంగల వెంకటేశ్వరరావు, షేక్ కరిముల్లా, గండి వాసు తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


