కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 22 : 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ లో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులలో భాగంగా బేస్మెంట్ మరియు పిల్లర్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. అంబెడ్కర్ విగ్రహం వెనుకవైపు ఉన్న రోడ్డు దిగువున ఉండడంతో ఫంక్షన్ హల్ నిర్మాణానికి సంబంధించిన మట్టి కిందకు జారి పడుతుందని కాలనీ వాసులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు.
ఈ సమస్యను శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ తో మరియు సంబంధిత అధికారులతో మాట్లాడి ముందువైపు నిర్మించిన విధంగానే వెనుకవైపు కూడా ప్రహరీ గోడ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించి సమస్యను పరిష్కరిస్తామని తెలియచేసారు. కార్యక్రమంలో నాగేష్ గౌడ్, అంజయ్య యాదవ్, యాదగిరి, అగ్రవాసు, శామ్యూల్, రవీందర్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


