Fishermen’s Mahadharna : మే 15న మత్స్యకారుల మహాధర్న

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ప్రతీ మత్స్య సోసైటికి 10 లక్షల రూ ఇవ్వాలని, ఉచిత చెప పిల్లలకు బదులుగా నగదు బదిలీ చేయాలని,50 ఎండ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని,మే 15న చలో ఇంద్రపార్క్. రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా పిలుపు.
తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం వికారాబాద్ జిల్లా ముఖ్యుల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బాని బాసయ్య అధ్యక్షతన ‌కలేక్టర్ ఆఫీస్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TMKMKS రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా హాజరై ముందుగా మే 15న జరిగే మత్స్యకారుల మహా ధర్నా కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం అయిన మాట్లాడుతూ జిల్లాలో 151 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి 5300 మంది సభ్యులు ఉన్నారు. కానీ వాటి బాగోగులు చూడాల్సిన పాలకులు పట్టించుకోవడం లేదు.మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారుల చెరువులు,కుంటల కబ్జాలు,కలుష్యం,

డ్రైనేజీ నీరు చేరువుల్లోకి రాకుండా చేయాలని,కరువులో చెరువులు,కుంటల లీజులు,రద్దు చేయాలని,ఉచిత చేప పిల్లల బదులుగా సోసైటిల బ్యాంకులో నగదు జమచేయాలని,50 ఎండ్లు నిండిన మత్స్యకారులకు పించన్లు ఇవ్వాలని,NCDC,NFDB స్కీమ్ కొనసాగించి 90శాతం సబ్సిడితో రుణాలు ఇవ్వాలని,వికారాబాద్ జిల్లా కేంద్రంలో 1కోటి రూ,నూతన టెక్నాలజీతో చేపల మార్కెట్ నిర్మించాలని,చనిపోయిన చేపలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని,తదితర సమస్యలు పరిష్కరించాలని మత్స్య శాఖ జిల్లా అభివృద్ధి అధికారి వెంకటయ్య కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బాని బాసయ్య,జిల్లా నాయకులు పూలగాజుల జంగయ్య,ఆర్.అనంతి, చెక్కల సాయిబ్రామ్, ఎం.మల్లేష్, కొట్ పల్లి సొసైటీ కార్యదర్శి, సత్యనారాయణ ఎ రమేష్, బి.గోవింద్,ఎన్ రాములు,ఆర్ నర్సింహులు, అంబా దాస్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fishermen's Mahadharna on May

You cannot copy content of this page

Scroll to Top