Bhu Bharati Awareness : డిండి మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి.

డిండి(గుండ్ల పల్లి) ఏప్రిల్ 21 త్రినేత్రం న్యూస్. దిండి మండల కేంద్ర ంలో తహసిల్ కార్యాలయ ఆవరణ లో సోమవారం రోజు ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీల రైతులతో ఈ భూభారతి చట్టం గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ భూభారతి చట్టం పై నూతన విధి విధానాల గురించి వివరించారు. ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పొందవచ్చు అని అన్నారు. జూన్ 2 నుండి ఆన్లైన్లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందన్నారు.
భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఇంతకుముందు రైతులు ఆఫీసర్ల దగ్గరికి పోవడం జరిగేది కానీ ఈ చట్టం ద్వారా ఆఫీసర్లే రైతుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 న భూభారతి చట్టంలోని రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందని తెలిపారు.
సాదా బైనామ కు సంబంధించిన అన్ని వివరాలు భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగిందని, ఈ భూభారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన భూముల విషయాలపై చట్టం పారదర్శకంగా పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఈ భూభారతి చట్టం ద్వారా అన్ని వర్గాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేకూరుతుందని వారు వ్యాఖ్యానించారు.
ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగపరుచుకోవాలని ఆమె ఈ సందర్భంగా రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, తాసిల్దార్ అంబటి ఆంజనేయులు, వ్యవసాయ మండలాధికారి రెహానా, రెవెన్యూ సిబ్బంది, రైతులు, పలుశాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhu Bharati Awareness Conference

You cannot copy content of this page

Scroll to Top