జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 22: రాష్ట్ర కూటమి ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఆదివాసి యువతపై తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం పార్టీ మండల శాఖ మండిపడింది. ఆదివాసి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, శాతశాతం ఉద్యోగాలు వారికే కేటాయించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో అరకువేలి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదాలో ఏజెన్సీ పర్యటన సందర్భంగా వేలాది నిరుద్యోగ గిరిజన యువతీ యువకులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపించారు. జీవో నెంబర్ 3ను రద్దు చేసి ప్రత్యామ్నాయ జీవో ద్వారా గిరిజన ఉద్యోగ అవకాశాలను గాలికొదిలారని, దీని వల్ల ఆదివాసి యువత తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు.
“గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక డిఎస్సీ వెంటనే విడుదల చేయాలి. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి,” అని రామారావు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు కిల్లో జగనాదం, గెమ్మెలి చిన్నబాబు, పాంగి రామన్న, సిహెచ్ గురుమూర్తి, పాంగి నానిబాబు, సిహెచ్ ప్రసాద్, వంజంగి మదన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Injustice to tribals with DSC

You cannot copy content of this page