తేదీ : 21/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఐసిడియస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి. రాధాకృష్ణ రావడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గర్భిణీల్లో రక్తహీనతను నియంత్రించేందుకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా గర్భిణీలకు సీమంతం, పిల్లలకు అన్న ప్రసన్న కార్యక్రమం జరిపించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


