MLC Kodandaram : కమీషనర్ దృష్టికి బస్తీ దావఖన సపోర్టింగ్ స్టాఫ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని

TRINETHRAM NEWS

ఎం.ఎల్.సి. కోదండరాం వినతి పత్రం అందజేశారు

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి 19 ఏప్రిల్ 2025

బస్తీ దవాఖానాలలో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ కు ప్రభుత్వ ఉత్తర్వుల జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు ఇటీవల పెరిగి వస్తున్నాయి.సపోర్టింగ్ స్టాఫ్ ల యొక్క బేసిక్ వేతనములో జి.ఎస్.టి,ఇతర మినహాయింపులు చేయడం వలన సపోర్టింగ్ స్టాఫ్ కు చేతికి జీతం కేవలం రూపాయలు 9917 రావడం జరుగుతుంది. కాని కనీసం వేతనం 13600 నగదు రావలసి ఉన్నదని ఎమ్.ఎల్. సి. కోదండరాం వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సపోర్టింగ్ స్టాఫ్ కు జూన్ 2021 నుండి వేతనాలు పెరగాల్సి ఉన్నదని పెరిగిన వేతనాలు జూన్ 2021 నుండి ఇప్పించాలని ,
2019 సంవత్సరం లో మెరిట్ పద్దతి లో నియామాకమై నియామాక పత్రాలు కలిగి కాంట్రాక్ట్ విధానం లో నియామకమై 6 సంవత్సరాల నుండి నుండి కాంట్రాక్టు విధానం లో పనిచేస్తున్న ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ ను కాంట్రాక్ట్ విధానం నుండి మార్పు చేసి ఇటీవల ఏజెన్సీ లకు అప్ప జెప్పడం తిరిగి ఇట్టి సపోర్టింగ్ స్టాఫ్ ను కాంట్రాక్ట్ విధానం లో పని విధానం ను అమలు చేయుటకు, మిగతా సపోర్టింగ్ స్టాఫ్ ను కూడ కాంట్రాక్ట్ విధానం అమలు చేయించాలని బస్తి దావఖన ఏర్పాటు అయిన 2018 నుండి వివిధ సంవత్సరముల లో కాంట్రాక్టు/ ఔట్ సోర్సింగ్ లలో నియామకమై నేటి వరకు పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ ల యొక్క వేతనాలలో మినహాయించిన ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్ లు సపోర్టింగ్ స్టాఫ్ అకౌంట్ లలో పూర్తి పెండింగ్ పీరియడ్ అమౌంట్ ను స్టేట్ హెల్త్ సొసైటీ, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ, ఏజెన్సీల నుండి జమ చేయించుటకు వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ఆర్.వీ. కర్ణన్ కు వినతి పత్రం ను అందసినట్లు టి.జె.ఎస్.కె.వి. కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఇటీ కార్యక్రమంలో బస్తీ దావఖన కాంట్రాక్టు & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు మంగళపాటీ సుమన్, కన్వీనర్ మెతుకు ఉప్పలయ్య , స్వప్న, శాంతమ్మ,పావని, హారిక,అనిత, అంబికా, మహేష్ , భావిక, లావణ్య మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Commissioner should be informed

You cannot copy content of this page

Scroll to Top