జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కార్పొరేట్ కు దీటుగా సత్తా చాటిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు

ఆల్ ఇండియా 208వ ర్యాంకు సాదించిన సునీల్ బాబు
త్రినేత్రం న్యూస్: అనపర్తి. ఈరోజు విడుదలైన జె.ఈ.ఈ. మెయిన్స్ – 2025 ఫలితాలలో జిబిఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్తుత్తమ ర్యాంకులు సాధించి తమ ఆధిక్యతను చాటారు. ఎం సునీల్ బాబు ఆల్ ఇండియా 208వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఏ. రామ్ జీ – 4053వ ర్యాంకును, ఎస్ భవానీ -10799వ ర్యాంకు, బి. వంశీకృష్ణ – 22095వ ర్యాంక్, సత్తి విజయశ్రీ – 31595వ ర్యాంక్, పి.జి.శ్రీనివాసరెడ్డి – 37836వ ర్యాంక్, పోతంశెట్టి హర్షిత – 38335వ ర్యాంక్, సత్తి మృదుల అమృత – 38353వ ర్యాంక్, డి. అమ్ములు – 54054వ ర్యాంక్, ఎస్. నాగబాబు – 72010వ ర్యాంక్, వి .మణికంఠ – 50794వ ర్యాంక్, సిహెచ్ శ్రావణ్ కుమార్ – 81599వ ర్యాంకులు సాధించారు.

వీరంతా జేఈఈ అడ్వాన్స్డ్ కు అర్హత సాధింనట్లు కళాశాల ప్రిన్సిపాల్ పి ఆర్ ఎల్ స్వామి తెలిపారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి కళాశాల ఖ్యాతిని ఇనుముడింప చేసిన విద్యార్థులను జిబిఆర్ విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ తేతలి ఆదిరెడ్డి (కొండబాబు) అభినందిస్తూ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయి పరీక్షలలో ర్యాంకులు సాధించడం తమ కళాశాలకు అధ్యాపక బృందానికి గర్వకారణమన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను,వారి తల్లిదండ్రులను, కృషిచేసిన అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల డైరెక్టర్లు బి. రత్నారెడ్డి, జి.జగన్నాథరెడ్డి, డివిఆర్ఏ పాపిరెడ్డి, కె. హరినాథరెడ్డి, మల్లిడి ఉమా వెంకటరెడ్డి, స్కూల్స్ డీన్ జి. హరిప్రసాద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ పి అబ్బాయిరెడ్డిలు అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

JEE Mains results: GBR

You cannot copy content of this page