Jayasudha : గద్దర్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్ గా జయసుధ

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహి స్తున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కోసం జ్యూరీ చైర్మన్ సినీనటి జయసుధ ను నియమించారు. ఆమె అధ్యక్షతన జ్యూరీ సమావేశం జరిగింది…

ఈ అవార్డుల కోసం వ్యక్తి గత క్యాటగిరీలో 1172 నామినేషన్లు, చలన చిత్రాలు, డాక్యుమెంటరీలు, పుస్తకాలు తదితర క్యాట గిరీలలో 76 నామినేషన్లు స్వీకరించబడ్డాయి.

మొత్తం 1248 నామినే షన్లతో ఈ అవార్డులకు భారీ స్పందన లభించినట్లు తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి జ్యూరీ సభ్యులు నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించను న్నారు.

ఈ సందర్భంగా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) ఛైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, జ్యూరీ సభ్యులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నామినే షన్లను పరిశీలించాలని కోరారు.

తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా జ్యూరీ సభ్యులు వ్యవహ రించాలి. ఈ అవార్డుల కోసం ప్రభుత్వం నిష్ణాతు లైన వారిని జ్యూరీ సభ్యు లుగా నియమించింది, అని ఆయన అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ, 14 ఏండ్ల విరామం తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను నిర్వహి స్తుండటం విశేషమని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డులకు ఇంతటి స్పందన రాలేదు. ఈసారి భారీ స్థాయిలో నామినే షన్లు రావడం సినీ రంగానికి గర్వకారణం అన్నారు.

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ తెలుగు సినిమా రంగంలోని ప్రతిభను గుర్తించి, సత్కరించే లక్ష్యంతో నిర్వహించబడు తున్నాయి. ఈ అవార్డులు చలన చిత్ర నిర్మాణంలో వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభను వెలికితీసేందుకు ఒక వేదికగా నిలుస్తాయని ఆశిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jayasudha appointed as chairman

You cannot copy content of this page

Scroll to Top