అల్లూరి జిల్లా పాడేరు త్రినేత్రం న్యూస్ మార్చి 12: రాష్ట్ర శాసనసభలో రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి గిరిజనేతరులకు పక్కా గృహాలు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయాలని చట్టసభలో మాట్లాడడం ఆదివాసులకు ఆదివాసీ హక్కులు,చట్టాలకు ద్రోహం చేయడమేనని ఆదివాసుల హక్కులు,చట్టాలు జొలికిస్తే సహించేది లేదని ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరించింది.
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ధర్మన్నపడాల్ పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ 1952 ముందునుండి రమాపచోడవరం ఏజెన్సీలో నివసిస్తున్నా 40% గిరిజనేతరులకు పక్కా గృహాలు నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని రంపచోడవరం ఎమెల్యే అడగడం 1/70 చట్టం ఉల్లంఘించడమే అవుతుందని 1/70 చట్టంపై ఇటీవల శాసనసభ స్పీకర్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆదివాసులు తిరగబడ్డారని దిగివచ్చిన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి 1/70 చట్టం రక్షణకై కట్టుబడి ఉన్నామని ప్రకటించడం నిజమేనా లేక ఆదివాసులకు నమ్మించి మోసం చేయడమా ఆదివాసీ ప్రజాప్రతినిధి అయివుండి ఆదివాసీ హక్కులు,చట్టాలు నిర్వీర్యం చేసేవిధంగా మాట్లాడడం అంటే రాష్ట్ర ప్రభుత్వం 1/70 చట్టం సవరణకు కుట్రలో భాగమేనని అనుమానించాల్సి వస్తుందని ఎమెల్యే శిరీషాదేవి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివాసులు రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారని జీఓ నెంబర్-3 చట్టబద్ధత కల్పించాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నోటిపికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు,వంతెనలు నిర్మించాలని త్రాగునీరు ఇవ్వాలని విద్య ,వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించాలని అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని తుఫాకి కర్మాగారం నిర్మాణ అనుమతుల రద్దు చేయాలని ఆదివాసులు ఆందోళన పోరాటాలు చేస్తుంటే ఆదివాసుల సమస్యలపై మాట్లాడకుండా ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలో అక్రమంగా నివసిస్తున్న గిరిజనేతరులకు పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వానికి కోరడం 1/70 చట్టం, పెసా చట్టాన్ని ఉల్లంఘించడమేనని తక్షణమే రంపచోడవరం ఎమెల్యే మిరియాల శిరీషాదేవి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


