త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. “యువత పోరు” పోస్టర్ ఆవిష్కరించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు పార్టీ నాయకులు
అనపర్తి: ఈనెల 12వ తేదీన వై యస్ ఆర్ సిపి ఆధ్వర్యంలలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు సోమవారం అనపర్తి పార్టీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.
సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసనగళం వ్యక్తం చేయడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిల పరిపాలనలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా రాష్ట్రంలో లక్షలాది విద్యార్థులు లబ్ధి పొందారని తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 9 నెలలుగా ఉన్న వసతి దీవెన, ఫిజు రియంబర్స్మెంట్ పథకాలకు 4600 కోట్లు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నాయకులు చెప్పిన హమీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలుఅర్హులైన అందరికీ అమలు చేయాలని,
కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రయత్నాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12వ తేదీ 9:30 రాజమండ్రి లోనితూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకలెక్టర్ కు వైఎస్ఆర్సిపి నాయకులు వినతి పత్రం ఇవ్వనున్నట్టు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఆప్షన్స్ సభ్యులు లంక చంద్రన్న, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు ఆర్కే దుర్గారెడ్డి, బీసీ సెల్ విభాగం అధ్యక్షులు కొండేటి భీమేశ్వర స్వామి అనపర్తి పట్టణ వైఎస్ఆర్సిపి కన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి బిక్కవోలు మండల పార్టీ కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి కాపవరం సర్పంచ్ సత్యం శెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


