జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 29 at 15.23.03

TRINETHRAM NEWS

బాబు మెగా డీఎస్సీ ఏమైంది?

ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం!

తూర్పు గోదావరి జిల్లా 21వ మహాసభలో మహాసభలో ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, నిరోద్యోగ సమస్యలపై దశలు వారి పోరాటం, ఏ ఐ వై ఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు

Trinethram News : రాజమండ్రి,జనవరి 29: ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వక పోవడం ,ఎన్నికల హామీ లను అమలు చేయడంలో కుటమి ప్రభుత్వం విఫలం చెందిందని బాబు మెగాడీఎస్సీ ఎక్కడ, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన మీరే మాట ఇచ్చి మాట తప్పుతారా అని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు ప్రశ్నించారు.

అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఎఫ్ తూర్పు గోదావరి జిల్లా 21 వ మహాసభ రాజమహేంద్ర వరం లోని అంబల్లా సూర్యారావు భవన్ లో జరిగింది.మహాసభ ప్రారంభ సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. ఎఐవైఎఫ్ అరుణ పతాకాన్ని ఏఐ వై ఎఫ్ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు ఆవిష్కరించారు.

అనంతరం జరిగినటువంటి సభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, మాట్లాడుతూ
యువగలం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మెగా డీఎస్సీ మీద తొలి సంతకం చేస్తామని వచ్చిన ఆరు నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే దేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరచారని 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మర చి పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మెగా డీఎస్సీ పేపర్ల కే పరిమితమైందని ఆరు నెలలకు గడుస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదని వేలాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక మెల్లలో తాళిబొట్లు అమ్మి మరీ కోచింగ్ సెంటర్లో విద్యను అభ్యసిస్తున్నారని ఉద్యోగాలు వస్తాయో రావు అనేటువంటి భయోందాలను ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి తెలియడం లేదా అని చెప్పి విమర్శించారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి అనేకమంది నిరుద్యోగులు నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుండి పీకేస్తుందని రాష్ట్రవ్యాప్తంగా 15,500 మంది గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపులలో వివిధ స్థాయిల్లో పనిచేశారని నేడుకోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని రోడ్డున పడేసిందని ఉగాది సందర్భంగా తీపి కబురు చెబుతున్న వాలంటీర్లకు పదివేల రూపాయలు గోరు వేతనం ఇస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు 260000 మంది వాలంటీర్లను రోడ్డు మీద పడేశారని నిరుద్యోగ భృతి ఎంతవరకు ప్రకటించకపోగా నిరుద్యోగ భృతికి అనేక అంశలు పెడతామని లీఖులు చేస్తూ నిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజ్వన్ గా ప్రకటించి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇచ్చేటటువంటి ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్యా మెరుగైన వైద్యం ఉద్యోగ ఉపాధి య అవకాశాల కోసం ఏఐవైఎఫ్ పోరాడుతుందని ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు జరుగుతున్నాయని మహాసభ ప్రారంభ సందర్భంగా ఫిబ్రవరి 6న యువకులతో యువజన ప్రదర్శన ,బహిరంగ సభ 7,8,9 తేదీల్లో జరిగే ప్రతినిధుల సభ యువజన కు ప్రతినిధులు పాల్గొంటున్నారనీ తెలిపారు.

22 వ రాష్ట్ర మహాసభల్లో సమగ్ర యువజన విధానం,నూతన పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి,ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ , ప్రవేటి కరణ కు,వ్యతిరేకంగా , విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి నిధులు, కడప లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం,వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక నిధులు, ప్రవీటి కరణ రిజర్వేషన్,నిధులు, రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్ చెసి ఉద్యోగ అవకాశాలు 26 జిల్లాల నుండి నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలని , రాజదాని,పోలవరం నిర్మణానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సమీకరించాలని,మతోన్మాదం కు వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ,కార్పొరేట్ వ్యక్తుల నల్ల ధనం పుణః పంపిణి చేయాలని,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీని వివిధ అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రుపొందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కొండల రావు,అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, కో కన్వీనర్ త్రిమూర్తులు, ఎఐయస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page