జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 29 at 14.37.46

TRINETHRAM NEWS

మైనింగ్ డాన్ మాటలు పై రామన్న దోర మండిపాటు.
గిరిజనుల జోలికివస్తే కూటమి ప్రభుత్వాన్ని కుక్కటి వేలతో పెక్కిలిస్తం.ఆదివాసి జేఏసీ నాయకులు.

అల్లూరిజిల్లా అరకులోయ,త్రినేత్రం, న్యూస్ జనవరి 30. ఏజేన్సీ ప్రాంత భూములు రక్షణకు ఉద్దేశించిన 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం అభివృద్దికి అడ్డం కాదని, చింతకాయల అయ్యన్నపాత్రుడి అక్రమ వ్యాపారాలకు అడ్డం వస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి జిల్లా కన్వినర్ రామారావు దొర ఘాటుగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్లు రూపాయలు ఖర్చు పెతున్న పాలకులకు సిత్తశుద్ది లేక ఆదివాసుల అభివృద్ది సాధ్యం కావడం లేదని, ఆదివాసులను అభివృద్ధి చేయడం ఇష్టం లేనివారు చట్టాలు అడ్డం పడుతున్నాయని పచ్చి బూతులు మాట్లాడుతున్నారని రామారావు దొర ఎద్దేవాచేశారు.
శాసనసభలో స్పీకర్ పదవి అత్యంత పవిత్రమైనదని, రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సభాపతి అనుమతి తీసుకుని మాట్లాడవసి ఉంటుందని, అటువంటి పవిత్రమైన సభలో ఆదివాసుల రక్షణ చట్టాలపై గౌరవం లేని అయ్యన్నపాత్రుడు సభాపతి కావడం దురదృష్టకరమని దొర ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాకుండా, అయ్యన్న పాత్రుడు సభాపతిలా కాకుండా “మైనింగ్ డాన్”లా మాట్లాడుతున్నాడని ఘాటు విమర్శ చేసారు. అణగారిన ప్రజల పట్ల బాద్యత రాహిత్యంగా మాట్లాడిన అయ్యన్నపాత్రుడు పై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జెఎసి జిల్లా కన్వినర్ రామారావు దొర డిమాండ్ చేసారు. ఆదివాసుల రక్షణ చట్టాలకు బంగం కలుగకుండా వారిని ఎలా అభివృద్ధి చేయాలో టిసిఆర్ఐ&టిఐ, దేబార్ కమిషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్గదర్శకాలు చేశాయని, వాటిని తున్దలోకి తొక్కి వస్తున్నాయని అవహేళన చేసి మాట్లాడుతున్నారని హేదేవచేసారు.
ఏజెన్సి ప్రాంత పరిపాలన, భూములు, అడవులు, వనరుల రక్షణకు అనేక చట్టాలు ఉన్నవాటిని పట్టించుకోకుండా విద్య, ఉద్యోగ, ఉపాది, రాజకీయ పదవులు, వనరుల దోపిడీ యదాతదంగా జరుగుతున్నాయని, వీటికి లేనిబయం అభివృద్ధి చేయడానికి ఎందుకని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి వ్యాక్యలకు వ్యతిరేకంగా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని రామారావు దొర స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమానికి ఆదివాసి జెఎసి పాడేరు మండల శాఖ కో కన్వినర్ తామారి సురేష్ బాబు, ఉబ్బేడిపుట్టు గ్రామసభ ఉపాధ్యక్షుడు, ఆదివాసి జెఎసి పాడేరు మండల శాఖ సభ్యుడు బోయిని నాగరాజు లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page