జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 28 at 15.41.12

TRINETHRAM NEWS

1/ 70 చట్టం జోలికొస్తే ఖబడ్దార్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి,- పి. అప్పలనర్స.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు)
అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ.

1/70 చట్టం జోలికి వస్తే ఖబడ్దార్

స్పీకర్ అయ్యన పాత్రుడు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి.
బాక్సైట్ తవ్వకాల కై 1/70 చట్టాన్ని సవరించాలని టి. ఏ.సి లో తీర్మానం పెట్టిన నాటి టి.డి.పి ప్రభుత్వం, టి. ఏ.సి లో ప్రభుత్వ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సి.పి.ఎం పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య.

1/70చట్టాని సవరించాలని స్పీకర్ చేసిన వాక్యాలను త్రివంగా ఖండించిన సి.పి.ఎం పార్టీ.

అసెంబ్లి స్పీకర్ అయ్యన పాత్రుడు వాక్యాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సి.పి ఎం పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ కార్యదర్శి, పి. అప్పల నరస డిమాండ్ చేశారు.

విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన ప్రాంతీయ పెట్టుబడిదారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను సిపిఎం పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటి గా తీవ్రంగా ఖండిస్తున్నాం.

గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం సవరణ ద్వారానే ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయని, అవకాశాలు ఉంటాయని స్పీకర్ వాక్యాలు చేశారు. ఉన్నత పదవిలోను, రాజ్యాంగ పదవిలో ఉండి స్పీకర్ స్థాయిలో ఇటువంటి వాక్యాలు చేయకూడదని రాజ్యాంగం పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాత్రం ఆదివాసీ చట్టాలపై,హక్కులపై వివాదాస్పద వాక్యాలు చేయడం సరికాదు.
స్పీకర్ వాక్యాలు ప్రభుత్వ వైఖరిని ప్రకటించినట్లు ఆదివాసీ సమాజం బహిస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక టూరిజం పరిశ్రమ ద్వారానే సాధ్యమనే తప్పుడు అభిప్రాయం తో పాలకులు ఉన్నారని, ఏజెన్సీ ప్రాంతాలను, కార్పొరేట్ కంపెనీలో అప్పగించి కుట్ర జరుగుతోందని సి.పి ఎం పార్టీ బహిస్తోంది. ఇప్పటికి గిరిజన ప్రాంతంలో 1/ 70 చట్టాన్ని పాలకులు నిర్వీర్యం చేశారు. చట్టాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాలే టూరిజం పేరుతో వందలాది ఎకరాల భూములను ఇప్పటికి ఆక్రమించారని, 1/70 చట్టాన్ని సవరించాలని వాక్యనించడం రాజ్యాంగ హక్కులను, ఆదివాసి చట్టాలను ధిక్కరించడం అవుతుంది . ఏజెన్సీ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చిన్న తరహా పరిశ్రమలను ఐటిడిఏ ద్వారా ఏర్పాటు చేయవచ్చని సి.పి.ఎం పార్టీ కోరుతుంది.
గతం లో బాక్సైట్ తవ్వకాలకు అడ్డుగా ఉందని 1/70 చట్టానికి సవరణలు చేయాలని నాటి టి.డి.పి ప్రభుత్వం గిరిజన సలహా మండలి( టి. ఏ.సి) లో తీర్మానం పెట్టిందని కేవలం సి.పి.ఎం పార్టీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాత్రమే దాని తీవ్రంగా వ్యతిరేకించారు. అటువంటి కుట్రకు నేటి ప్రభుత్వాలు పూనుకోవడం దారుణమని, పి. అప్పలనరస మీడియా ముందు వాపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page