Prajaseva : ప్రజసేవే పరమావధిగా ప్రజల మాస్టారు

TRINETHRAM NEWS

ప్రజసేవే పరమావధిగా ప్రజల మాస్టారు

(టీచర్ గా మారిన ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం)

అల్లూరి సీతారామరాజు జిల్లా త్రినేత్రం న్యూస్ జనవరి 28:

అరకు శాసనసభ్యులు మత్స్య లింగం మాస్టరు. శాసనసభ్యులు కాకముందు, దానికి ముందు, రాజకీయాలకు రాకముందు, ఉపాధ్యాయులుగా వృత్తిని కొనసాగించేవారు. శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కూడా ఆయనకు ఉపాధ్యాయ వృత్తిపై అభిమానం తగ్గడం లేదు. తగ్గింది అని అనుకుంటే పొరపాటే.ఆయన నిత్యం పాఠశాలలను సందర్శిస్తూ ఉంటారు.ఎందుకు అని అంటే రేపటి ఉత్తమ పౌరులను అందించేది పాఠశాలలు మాత్రమేని ఆయన బలంగా నమ్ముతారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, చదువు ఒకటే జీవితాన్ని మారుస్తుందని ఎంత బలంగా అయితే నమ్ముతారో ,రేగం మత్స్యలింగం కూడా అంతే బలంగా దాన్ని విశ్వసిస్తారు. అందుకే నిత్యం పాఠశాల సందర్శించి అక్కడ నాణ్యమైన విద్యా బోధన జరగాలని పౌష్టికాహారం విద్యార్థులకు అందాలనే లక్ష్యంతో నిరంతరం ఆయన పనిచేస్తున్నారు.

తాజాగా ముంచంగిపుట్టు మండలం (జిటిడబ్ల్యూ ఏ) బాలికల,బంగారమెట్ట పాఠశాలలో ఆయన సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా ఉపాధ్యాయ అవతారం ఎత్తి పాఠశాలలో విద్యార్థులు,వివిధ సబ్జెక్టుల్లో చదివించి కొన్ని సందేహాలను కూడా నివృత్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు విద్యార్థులను తమ బిడ్డలగానే భావించి ఉత్తమ విద్యను అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.గిరిజన సమాజం వెనుకబడి పోవడానికి కారణం విద్యాలేమేనని ఆయన అభిప్రాయపడ్డారు. విద్య ఒకటే గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని,తాను బలంగా నమ్ముతున్నట్లు అందుకే విద్యాభివృద్ధికి కృషి చేయాలని,ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదబయలు మండల నాయకులు కొండబాబు, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top