ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 07 at 10.59.15 AM

TRINETHRAM NEWS

రేపటి నుండి రైతుల ఖాతాలో రైతు బంధు జమ

Trinethram News : హైదరాబాద్: జనవరి 07
రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నం దున రైతులకు అవసరమైన పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు అధికారు లను ఆదేశించారు.

శనివారం మంత్రి అధికారు లతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.

ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు. 27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.

మిగిలిన రైతులకు కూడా త్వరితగతిన నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు. సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.

ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరో మారు సమీక్ష నిర్వహిస్తామన్నారు. రైతుల సంక్షేమం ,వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.

గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర రైతాంగం , ప్రజలు రైతుబంధు నిధుల విడుదలపై ఎటువంటి అనుమానాలు పెట్టుకో వాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు….

You cannot copy content of this page