TRINETHRAM NEWS

Brs పార్టీ భువనగిరి కార్యాలయం పై దాడి ని ఖండిస్తున్నాం.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

కాంగ్రెస్ డీఎన్ఏలోనే విద్వేషం

రాజ‌కీయంగా ఎదుర్కోలేక దాడులు

రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ బూటకం

కాంగ్రెస్ ది విద్వేషం, హింస‌ను ప్రేరేపించే దుకాణం

కాంగ్రెస్ యువ‌జ‌న విభాగం గూండాల విభాగంగా మారింది

కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శ‌నం

కాంగ్రెస్ గూండాల‌ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాలి

భౌతిక దాడుల‌తో గులాబీ సైనికుల‌ను భ‌య‌పెట్ట‌లేరు

యాదాద్రి – భువన‌గిరి బీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యంపై దాడిని ఖండించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ : యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గూండాలు చేసిన‌ దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ద్వేషం, హింస‌, విధ్వంసం ఉంద‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి ప్రోద్భ‌లంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నార‌ని విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమ‌ని స్ప‌ష్టం చేశారు. భౌతిక దాడులతో గులాబీ సైనికులను భయపెట్టలేరని తేల్చిచెప్పారు. ఈ దాడిని పిరికిపంద చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

రాహుల్ గాంధీ వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమ‌ని తేట‌తెల్ల‌మైందని, అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇలాంటి హింసా రాజ‌కీయాల‌ను తెలంగాణ తిర‌స్క‌రిస్తుందని, హింస‌కు, విద్వంస‌క‌ర చ‌ర్య‌ల‌కు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ యువ‌జ‌న విభాగాన్ని గూండాల‌ విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిప‌డ్డారు. యాదాద్రి భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ, యువ‌జ‌న కాంగ్రెస్‌ జరిపిన దాడి వారి అసలు రంగును బట్టబయలు చేసిందని, కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శ‌నమ‌ని చెప్పారు. ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు బుద్దిచెబుతార‌ని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే అరెస్టు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App