జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 12.26.26 PM

TRINETHRAM NEWS

టెంపుల్ సిటీలో కోవిడ్ కలకలం.. చికిత్స పొందుతూ కోవిడ్‌తో ఒకరు మృతి

తిరుపతి:

తిరుపతి జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో కొవిడ్ కేసుల సంఖ్య 20 కి చేరుకుంది. గత వారం రోజులుగా పెరుగుతున్న కోవిడ్ కేసులతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నిన్న రుయాలో నిర్వహించిన ర్యాపిడ్ పరీక్షల్లో 16 మందికి కోవిడ్ పాజిటివ్ రాగా ఇసోలేషన్ వార్డులో 20 కోవిడ్ తో చికిత్స పొందుతున్నట్లు రుయా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రాపిడ్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిని అనుమానితులుగానే గుర్తించాలంటున్న వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పెనుమూరుకు చెందిన వృద్ధురాలు చికిత్స పొందుతూ కోవిడ్‌తో మృతి చెందింది.

మెడికల్ విభాగంలోని ప్రత్యేక వార్డులో కోవిడ్ బాధితులకు చికిత్స అందిస్తున్న రుయా వైద్యులు అనుమానిత లక్షణాలున్న వారు ట్రయాజ్ సెంటర్ లో పరీక్షలు చూసుకొని వైద్య సహాయం పొందాలని కోరుతున్నారు.

You cannot copy content of this page