WhatsApp Image 2024 01 02 at 2.19.54 PM
రేపటినుండి ఉత్తరాంధ్ర జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన
అమరావతి: జనవరి 02
టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన లను మళ్లీ ప్రారంభించ నున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో మన స్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించ నున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు.
జనవరి 3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖ పట్నం జిల్లాలకు భువనేశ్వరి వెళ్లనున్నారు.
గతంలో పలు కుటుంబాలను ఆమె పరామర్శించిన విషయం తెలిసిందే.
