WhatsApp Image 2024 11 29 at 16.10.55
మధ్యాహ్న భోజనాలలో మెనూ పాటించాలి: ఎంఈవో
Trinethram News : ప్రకాశం జిల్లా కంభం. డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను మెనూ ప్రకారం నిర్వహించాలని ఎంఈవోలు మాల్యాద్రి, శ్రీనివాసులు అన్నారు.శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రంగరాజు ఎయిడెడ్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డొక్కా.సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలలో లోటుపాట్లకు ఆస్కారం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.వంట తయారీ విధానంలో రుచి,నాణ్యత, పరిశుభ్రతలకు పెద్దపీట వేయాలంటూ నిర్వాహకులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఆర్పిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
