జూన్ 27, 2026

IMG 20241125 WA0038

TRINETHRAM NEWS

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
లగచర్ల రైతులకు న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం సమర్పించిన గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ నేడు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ని కలిసి లకచర్ల గ్రామంలో గిరిజన రైతులపై జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల గురించి అమాయకమైన గిరిజనుల భూములు లాక్కుంటున్నారని ఫార్మ పేరుతో గిరిజన తండాలను నామరూపం లేకుండా చేస్తున్నారని ఇట్టి విషయాన్ని ప్రభుత్వాన్ని విన్నవించే విధంగా ఎస్ఎస్సి కమిషన్ చైర్మన్ వెంకటయ్య ని కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ ని కోరడమైనదని గిరిజనులు ప్రాణం పోయినా భూమి ఇవ్వబోమని మాకు న్యాయం జరగాలని కోరారు అన్నారు. గిరిజనుల ఓటు బ్యాంకుతో గెలిచి చివరికి కొడంగల్ నియోజకవర్గంలోని అమాయక గిరిజనుల తండాలలో కాంగ్రెస్ పార్టీ వితండవాదం చూపిస్తుందని గిరిజన రైతుల జోలికి వస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి త్వరలోనే గిరిజనుల పై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని గిరిజన విద్యార్థి సంఘం తరఫున ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య కి వినతి పత్రం సమర్పించడం జరిగిందని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ టి కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారు కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, నిల , గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు అంకుష్ నాయక్ రాహుల్ నాయక్ లగచర్ల రైతులు రోటి బండ తండావాసులు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page