WhatsApp Image 2024 11 25 at 17.19.56
ప్రజల అర్జీలను త్వరగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
*ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, నవంబర్- 25: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రజావాణి అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ హర్ష, అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, డి.వేణు లతో కలిసి పాల్గొని ప్రజల దరఖాస్తులను స్వీకరించి , సంబంధిత అధికారులకు కేటాయిస్తూ ప్రజల దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి రెవెన్యూ శాఖకు సంబంధించిన 6 దరఖాస్తులు , ఇతర శాఖలకు సంబంధించి 19 దరఖాస్తులు మొత్తం 25 దరఖాస్తు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
