బలహీన వర్గాలకు చెందిన రైతు భూమిని ఆక్రమించుకున్న ఇండియా సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

బలహీన వర్గాలకు చెందిన రైతు భూమిని ఆక్రమించుకున్న ఇండియా సిమెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

బీసీ కమిషన్లో ఫిర్యాదు చేసిన బీసీ నేత లింగంగౌడ్

Trinethram News : నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి శివారులో ఉన్న బలహీన వర్గాలకు చెందిన బీసీ దారగాని వెంకటేశ్వర్లకు చెందిన భూమి సర్వే నెంబర్ 483లో 1.24 భూమిని గత 40 సంవత్సరాలుగా అతను సాగు చేసుకుంటున్న స్థానికంగా ఉన్న ఇండియా సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం భూమిని అక్రమించేందుకు ప్రయత్నిస్తూ నాలుగు రోజుల క్రితం పరిశ్రమ వారు మంది మార్బలంతో యంత్రాలతో వచ్చి సాగు చేసుకుంటున్న భూమిని ద్వంసం చేయడమే కాకుండా చుట్టూ ఉన్న కడీ లను పెన్సింగ్లను సైతం విరగగొట్టారు గతంలో కూడా ఈ పరిశ్రమలు ఇబ్బందులు పెడితే భూ యజమాని ధారగాని వెంకటేశ్వర్లు మిర్యాలగూడ కోర్టు ను ఆశ్రయించగా ఆయనకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని,జిల్లా కోర్టులో కూడా ఆయనకే అనుకూలంగా తీర్పునప్పటికీ బీసీ రైతును ఇబ్బందులకు గురి చేస్తూ అక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని వెంటనే పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అయనకు న్యాయం చేయాలనీ లింగంగౌడ్ ఫిర్యాదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top