జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 30 at 2.47.42 PM

TRINETHRAM NEWS

బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు ఈడీ నోటీసులు.

హైదరాబాద్‌ డిసెంబర్ 30:హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హెచ్‌సీఏ మాజీ చీఫ్‌ వినోద్‌కు శుక్రవారం సాయంత్రం ఈడీ నోటీసులు జారీ చేసింది.

జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలని అందులో స్పష్టం చేసింది హెచ్‌సీఏలో రూ.20 కోట్ల నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తుచేస్తున్నది.

ఇందులో భాగంగా ఇప్పటికే క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అర్షద్‌ అయూబ్‌ శివలాల్‌ యాద వ్‌ను నిన్న శుక్రవారం విచారించింది.

వారితోపాటు వినోద్‌ కూడా విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది.

ఉప్పల్‌ స్టేడియం నిర్మాణ సమయంలో అక్రమాలు చోటుసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించి ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.

ఎఫ్‌ఎఆర్‌ అవినీతి నిరోధక శాఖ చార్జిషీట్‌ ఆధారంగా ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది.

You cannot copy content of this page