జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 2.55.52 PM

TRINETHRAM NEWS

రైలు పట్టాలపై గొడవ: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి.

హైదరాబాద్ డిసెంబర్ 30:
వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం గంజాయి పీల్చడం వారి హాబీ తరచూ గొడవలు పడుతుంటారు.

ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు అక్కడ ఘర్షణ పడ్డారు ఇదే క్రమంలో రైలు దూసు కొచ్చింది దీంతో ట్రైన్ ఢికొని వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయంలో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంత మంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

You cannot copy content of this page