అనునిత్యం ప్రజా సేవలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్

TRINETHRAM NEWS

అనునిత్యం ప్రజా సేవలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పలు సంక్షేమ సంఘాల నాయకులు ఈరోజు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు ఆయనకు విన్నవించారు. వినతులు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని, నియోజకవర్గంలోని సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం సత్వర చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గౌరవ ఇంఛార్జ్ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసి కాలనీలు బస్తీలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని అన్నారు. పలువురు పలు ఆహ్వాన పత్రికలు మాజీ ఎమ్మెల్యే కి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం పలు వివాహ వేడుకల లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాలకు కూన శ్రీశైలం గౌడ్ హాజరైనారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top