మట్టికి ప్రాణం పోసే గొప్పవారు శాలివాహనులు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

మట్టికి ప్రాణం పోసే గొప్పవారు శాలివాహనులు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

Trinethram News : ఈరోజు 128 – చింతల్ డివిజన్ హెచ్ఎంటి కాలనీలో నిర్వహించిన కుమ్మర (శాలివాహన) కార్తీక వనభోజన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ మట్టికి ప్రాణం పోస్తూ కుండలను తయారు చేయడమే కాదు, కధన రంగంలో తమ పరాక్రమాన్ని చాటిన వంశం శాలివాహన వంశం అని అన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, కుమ్మర (శాలివాహన) సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, ఉపాధ్యక్షులు ఆర్. వీరేశం, కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు రాజవరపు శివన్నారాయణ, అధ్యక్షులు బాపనపల్లి నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాజవరపు శివప్రసాద్, కాశయ్య, కోశాధికారి పి. రాజు (శిల్పి), సంయుక్త కార్యదర్శి కె. రాధాకృష్ణ, శాలివాహన కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top