జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 10 at 3.34.34 PM

TRINETHRAM NEWS

వనభోజనాలు మనలో సామాజిక స్పృహ, ఐక్యతను పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ప్రథమ ఆర్యవైశ్య కార్తీకమాస సమారాధన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ వనభోజనాలు మనలో సామాజిక స్పృహ, ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు పగిడి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, జగద్గిరిగుట్ట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్త, ప్రెసిడెంట్ ఉప్పల్ రమేష్ గుప్త, ఇంద్రసేనా గుప్త, ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యులు వాస శ్రీనివాస్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్ గుప్తా, ఆకుల ప్రసాద్, ఆకుల ప్రభాకర్ గుప్త, మదిరాల శేఖర్, దేవరశెట్టి జగదీష్, బీరెల్లి వేణుగోపాల్, బివిఎస్ఎన్ మూర్తి, బచ్చు వంశి, చేవూరి సంతోష్, విజయ్ భాస్కర్, బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా, గట్టు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page