జూలై 17, 2026

WhatsApp Image 2023 12 29 at 7.32.32 PM

TRINETHRAM NEWS

వైసిపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల పట్టణం లోని దేవుడు మాన్యం , బాపట్ల మండలం మూలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారు.

ఈ సందర్బంగా నరేంద్ర వర్మ గారు మాట్లాడుతూ….

✌️ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ఆయన అన్నారు

✌️ అభివృద్ధి ధ్యేయంగా పాలన అందించే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని అన్నారు

✌️ బాపట్ల నియోజకవర్గం లోని నిరుద్యోగులకు ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు

✌️ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు

✌️ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page