24 దుకాణాల సముదాయానికి భూమి పూజ చేసిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

TRINETHRAM NEWS

24 దుకాణాల సముదాయానికి భూమి పూజ చేసిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో రూ. 1.14 కోట్లతో నూతనంగా నిర్మించే 24 దుకాణాల సముదాయానికి ఈరోజు భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ శ్రీమతి చిగుళ్ళపల్లి మంజుల రమేశ్, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, కూరగాయల వ్యాపారులు, ప్రజలు. వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్నకార్మికులకు యూనిఫాం దుస్తులను పంపిణీ చేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్
ఈ సందర్భంగా జరిగిన సభలో సభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూవికారాబాద్ మార్కెట్ కమిటీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇక్కడే ఖర్చు చేసుకోవచ్చని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి గారు అనుమతులు ఇచ్చారు, కాబట్టి అవసరమైనపనులుచేసుకోవచ్చు.మార్కెట్ లో అవసరమైన ఇతర వసతులకు కూడా నిధులు మంజూరు చేయిస్తాను
వచ్చే అయిదేళ్ళలో వికారాబాద్ నియోజకవర్గాన్ని భారీ ఎత్తున అభివృద్ధిచేస్తాను.వుడాఏర్పాటుతో జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగబోతుంది.పట్టణాలు, గ్రామాలలో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది.వికారాబాద్ చుట్టూ రూ. 850 కోట్లతో రింగ్ రోడ్డు రాబోతుంది.పట్టణంలో ప్రజల సౌకర్యం కోసం అన్ని రకాల మౌళిక వసతులు అభివృద్ధి చేస్తాం. అని ఈ సందర్భంగా తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top