MA Aziz’s son Salman who got the laddu for 23 thousand in the auction at Vinayakan
Trinethram News : మోమిన్ పేట మండల కేంద్రంలో హనుమాన్ మందిర్ వినాయక నిమజ్జనం రోజు అదే గ్రామానికి చెందిన ఎంఏ అజీజ్ తనయుడు సల్మాన్ లడ్డు వేలంపాటలో 23 వేల కు లడ్డును దక్కించుకున్నాడు. మండల కేంద్రంలో హిందువులకు దీటుగా వేలంపాటలో మైనార్టీ యువకుడు వినాయకుని లడ్డును కైవసం చేసుకోవడం మండల చరిత్రలోనే చారిత్రాత్మకము. వినాయకుని ఉత్సవంలో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మండల కేంద్రానికి చెందిన మైనార్టీ యువకుడు హిందువులకు దీటుగా వేలంపాటలో పాల్గొని 23 వేలకు లడ్డూ ప్రసాదం ను దక్కించుకోవడం మోమిన్ పేట చరిత్రలో మొట్టమొదటిసారి.
వినాయకుని ఉత్సవాల్లో మైనార్టీ సోదరులు పాల్గొనడమే చాలా అరుదు, అందులో వేలంపాటలో హిందువులతో పోటీపడి లడ్డు ప్రసాదము కైవసం చేసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమని పలువురు చర్చించుకుంటున్నారు. సల్మాన్ గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలవడం కాకుండా హిందూ పండుగలలో, ఉత్సవాలలో పాల్గొని మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలిచారని చెప్పవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App