జూలై 16, 2026

WhatsApp Image 2023 12 26 at 12.15.26 PM

TRINETHRAM NEWS

Dhulipalla: గ్రావెల్‌ మాఫియాకు వ్యతిరేకంగా ధూళిపాళ్ల పాదయాత్ర

చేబ్రోలు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ధనదాహానికి 700 ఎకరాలకు పైగా పండ్ల తోటలు కనుమరుగయ్యాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు..

అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ ఆయన రెండు రోజుల పాదయాత్రను చేపట్టారు. చేబ్రోలు మండలం శ్రీరంగపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఏడు గ్రామాల పరిధిలోని క్వారీలను పరిశీలిస్తూ పాదయాత్ర కొనసాగనుంది. స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే గ్రావెల్‌ తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయని ధూళిపాళ్ల విమర్శించారు. గత నాలుగేళ్లుగా రూ.2100కోట్ల విలువైన తవ్వకాలు చేపట్టారని ఆయన అన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో పని చేసే రవిచంద్రకు ఈ తవ్వకాల్లో భాగస్వామ్యం ఉందని ఆరోపించారు..

You cannot copy content of this page