Trinethram News : సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ అదికారులు, సిబ్బందికి, EX ఆర్మీ ఉద్యోగులకు,ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులకు బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాము
సిబ్బంది నిష్పక్షపాతంగా, నిబద్దతతో ఎన్నికల విధులు నిర్వహించాలి
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు
సిబ్బంది నిష్పక్షపాతంగా, నిబద్దతతో ఎన్నికల విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశించారు. బాపట్ల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించనున్న పోలీస్ అదికారులు, సిబ్బందికి, EX ఆర్మీ ఉద్యోగులకు , ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులతో మే 12 న బాపట్ల పట్టణంలోని బాపట్ల మహిళా ఇంజనీరింగ్ కళాశాలలోని సమావేశ హాలు నందు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల రోజు, ఎన్నికల ముందు రోజు నిర్వహించవలసిన విధులు గురించి దిశానిర్దేశం చేసినారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది, EX ఆర్మీ ఉద్యోగులు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, నిబద్ధతతో, నిజాయితీగా నిర్వహించాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూనే చిత్త శుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ కేంద్రంలా వద్ద విధులు నిర్వహించే వారు ఓటర్లను సరైన పద్ధతిలో క్యూ లైన్ లలో పంపాలని, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలన్నారు. పోలింగ్ కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేవారు తప్పా ఇతరులు ఎవరు ఉండకూడదని, వాహనాలు కూడా రావడానికి అనుమతి లేదన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఓటింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించడానికి అనుమతి ఉంటుందన్నారు. ఆ పోలింగ్ కేంద్ర పరిధిలో విధులు నిర్వహించే మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ లలోని అధికారుల ఫోన్ నెంబర్ లు తెలుసుకొని ఉండాలన్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశమున్న, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా వున్న వెంటనే మొబైల్ పార్టీలకు సమాచారం అందించాలన్నారు. వారు వచ్చి సమస్యను పరిష్కరిస్తారన్నారు.
మొబైల్ పార్టీలలో ఆయుధాలు కలిగిన పోలీస్ లు విధులలో ఉంటారని, వారికి అప్పగించిన మార్గంలోని పోలింగ్ కేంద్రాలకు తీసుకు వెళ్ళే ఈవీఎం లకు, పోలింగ్ సిబ్బందికి ఎస్కార్ట్ గా వెళ్ళి ఈవీఎం లను, పోలింగ్ సిబ్బందిని వారివారి పోలింగ్ కేంద్రాల వద్ద సురక్షితంగా దింపి, పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి బాపట్ల పట్టణంలోని బిఈసీ కాలేజీలో వాటిని సురక్షితంగా అప్పగించాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచెయ్యడానికి ఎన్నికల ముందురోజు రాత్రి అక్రమ మద్యం, నగదు, ఇతర వస్తువులు పంపిణి చేసే అవకాశం ఉంటుంది కనుక, వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. రాష్ట్రమంతా సెక్షన్ 144 సీఆర్పీసీ అమలులో ఉన్నందున ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడితే వారి పై చర్యలు తీసుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలలో ఎటు వంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” (“SAMARTH”-Security Arrangement Mapping Analysis Response Tracking Hub) మొబైల్ యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. “సమర్థ్” మొబైల్ యాప్ ను జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు వారి మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఈ యాప్ లో సమస్యాత్మక, సాధారణ పోలింగ్ కేంద్రాల వివరాలు, వాటి లొకేషన్ లు, మీకు అందుబాటులో వున్న స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్, రూట్ మొబైల్ పార్టీ లలో విధులు నిర్వహించే పోలీస్ అదికారుల వివరాలు, వారి లొకేషన్ తెలుసుకోవచ్చునని తెలిపినారు. తద్వారా ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే యాప్ లోని sos బటన్ ప్రెస్ చేస్తే మీ పరిధిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయని అర్థమైయేవిధంగా యాప్ లో మీరు ఎరుపు రంగులో సూచించబడతారన్నారు. తద్వారా మీకు సమీపంలో ఉన్న స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్, రూట్ మొబైల్ పార్టీ లు నావిగేషన్ ద్వారా మీరు ఉన్న ప్రదేశానికి వేగంగా చేరుకుని శాంతిభద్రతలను పరిరక్షిస్తారని తెలిపారు.
సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగమైన భారత రాజ్యాంగంలో ఎన్నికల ప్రక్రియ అనేది చలాకీలకమని, ఎన్నికల విధులలో ప్రతి ఒక్కరు నిష్పక్షపాతంగా, నిబద్దతతో వ్యవహరిస్తూ, వారికి అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వహిచాలని సిబ్బందికి ఎస్పీ గారు సూచించారు. ఎన్నికల విధులలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాము
ఎస్పీ గారు చెప్పిన సూచనలను జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలలో విధులు నిర్వహించేవారు సైతం వినే విధంగా తగిన ఏర్పాట్లు చేసినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితోపాటు బాపట్ల డిఎస్పీ సిహెచ్.మురళీకృష్ణ గారు, బాపట్ల పట్టణ సిఐ యు.శ్రీనివాసులు, బాపట్ల రూరల్ స్టేషన్ సిఐ వై.శ్రీహరి, బాపట్ల రూరల్ సర్కిల్ సిఐ బి.హజరత్ బాబు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, EX ఆర్మీ ఉద్యోగులు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.