TRINETHRAM NEWS

24వ తేదీ 2024 ప్రత్యేకత
మాఘపూర్ణిమ :

ఏడాదిలో వచ్చే పవిత్రమైన నాలుగు మాసాల్లో మాఘం ఒకటి. ఆషాఢం, కార్తికం, మాఘం, వైశాఖం అనే ఈ పరంపరలో కార్తికం, మాఘం స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో సముద్రస్నానం, నదీస్నానం తప్పనిసరిగా చేస్తుంటారు. కార్తికంలో దీపవ్రతాలు చేసినట్లే, మాఘంలో స్నానవ్రతం చేయడం పురాణ ప్రసిద్ధంగా కనిపిస్తోంది.

మాఘపౌర్ణమిని మనవారు మహామాఘి అంటారు. “మాఘే నిమగ్నాహః సలిలే సుశీలే విముక్త పాపాః త్రిదివం ప్రయాంతి” మాఘమాసంలో పారే నీటియందు నిలిచి, మంచిమనసుతో స్నానం చేసి, సూర్యునికి ఆర్ఘ్యమిస్తే పాప విముక్తులై స్వర్గానికి చేరుకుంటారు అని ఈ శ్లోకానికి అర్థం.

మాఘస్నాన వ్రతం అత్యుత్తమ ఫల దాయకం. కోటిజన్మల పాపం సైతం మాఘస్నానం ప్రక్షాళన చేస్తుందని శాస్త్రం.