జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 23 at 19.02.40

TRINETHRAM NEWS

చొప్పదండిలో పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

స్వేరోస్ ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల విద్యా విధానంలో పెను మార్పులను తీసుకువచ్చారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించారని పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని ప్రతిజ్ఞ దినంగా జరుపుకుంటామని చెప్పారు. ఉద్యోగంలో, రాజకీయాల్లో ఆర్.ఎస్.పి తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. ఆయన పోలీస్ పదవి కాలంలోనే అత్యున్నత సేవలకు రాష్ట్రపతి పోలీస్ మెడల్ ని అందుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధానకార్యదర్శి కళ్లేపల్లి అరవింద్, స్వేరోస్ పట్టణ అధ్యక్షులు కొత్తూరి శ్రవణ్, ఇరుగురాళ్ళ రమేష్, మాచర్ల రోహిత్, తడగొండ ప్రవీణ్ కుమార్, కనకం శ్రీను, తాండ్ర లూకా, కళ్లేపల్లి రిషి, స్వేరోస్ ఫిట్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page