జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 23 at 19.42.49

TRINETHRAM NEWS

జిల్లా స్థాయి  క్రీడాకారిణి అభినందించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, నవంబర్ -23: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లా స్థాయి క్రీడాకారిణి తుమ్మల మనోజ్ఞ ను జిల్లా కలెక్టర్ కోయ హర్ష అభినందించారు.

ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల 9వ తరగతి చదువుతున్న తుమ్మల మనోజ్ఞ అనే విద్యార్థి ఎస్.జి.ఎఫ్  అండర్ 17 జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని, జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూలో తెలంగాణ రాష్ట్ర తరఫున మనోజ్ఞ పాల్గొంటుంది.

ఈ సందర్భంగా శనివారం
కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యార్థిని శాలువాతో సత్కరించి అభినందించారు .

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష  విద్యార్థికి  అవసరమైన స్పోర్ట్స్ కిట్ అందిస్తామని తెలిపారు.  విద్యార్థిని అభినందిస్తూ జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పథకం తీసుకురావాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్ కుమార్ ,వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య,  మేకల సంజీవరావు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page