నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ: నేడు, రేపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. భారత మండపం వేదికగా మరోసారి పార్టీ ప్రచార కమిటి, ప్రధాని అభ్యర్ధిగా మోదీని బీజేపీ నేతలు ఎన్నుకోనున్నారు..

నేడు ఉదయం జాతీయ పదాథికారులు సమావేశం కానున్నారు. నేడు జాతీయ కార్యవర్గ సమావేశ ప్రదేశంలో బీజేపీ జెండాను జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం నుంచి భారత మండపంలో పార్టీ విసృత్త జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం వరకూ సమావేశాలు జరగనున్నాయి..

ఆదివారం జాతీయ కార్యవర్గ సమావేశాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి మోదీని ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించనుంది. పార్టీ ఎన్నికల ప్రచార సారధిగా కూడా మోదీని నేతలు ఎన్నుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ… జాతీయ కౌన్సిల్‌లో తీర్మానం జరిగింది. రెండు రోజుల కీలక సమావేశాల నేపథ్యంలో భారత మండపంలో పదేళ్ళ ప్రగతి ప్రస్థానాన్ని తెలుపుతూ ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను పార్టీ ఏర్పాటు చేసింది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు..

You cannot copy content of this page

Scroll to Top