As BJP prepares for upcoming Assembly polls its top target is KCR
Trinethram News : హైదరాబాద్
తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్ 70వ బర్త్ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు రెడీ అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేసేందుకు పార్టీ కార్యకర్తలు రెడీ అయ్యారు..
మరో వైపు కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 1000 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమాను బహుమతిగా ఇవ్వాలని బీఆర్ఎస్ చూస్తుంది. ఏడాదికి లక్ష రూపాయల బీమా కవరేజీని అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు శారీరక వికలాంగులకు బీఆర్ఎస్ వీల్‌చైర్‌లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే, కేసీఆర్ జీవితంపై “తానే ఒక చరిత్ర” (ఆయన చరిత్ర వ్యక్తి) అనే డాక్యుమెంటరీతో కేసీఆర్ చిన్ననాటి నుంచి ఇటీవల జరిగిన ‘ఛలో నల్గొండ’ సభ వరకు ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన జీవితంపై 30 నిమిషాల డాక్యుమెంటరీని ఇవాళ విడుదల చేయనున్నారు..
