TRINETHRAM NEWS

Trinethram News : తేది:03-02-2024
స్థలం: ఏలూరు

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా: దెంద‌లూరు సిద్ధం స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్

రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు రూపంలో ఇక్కడే ఉన్నారు

ఇంతమంది తోడేళ్ల మధ్యన వైయ‌స్‌ జగన్‌ ఒంటరిగానే కనిపిస్తాడు.. కానీ నిజం ఏంటంటే..కోట్ల మంది హృదయాల్లో వైయ‌స్ జగన్‌ ఉన్నాడు.. ఇక్కడ కనిపిస్తున్న జనమే నిజం

ప్రజలు నా స్టార్‌ క్యాంపెయినర్లు.. పేదలకు అండగా నిలిచేందుకు 57 నెలల్లో 124 సార్లు బటన్‌ నొక్కాం.. ఈసారి మీరు నా కోసం బటన్‌ నొక్కండి

ప్యాకేజీ కోసం రా.. కదలిరా అంటూ బాబు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు.. చంద్రబాబు అండ్‌కోపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా : సీఎం జ‌గ‌న్‌

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం వైయ‌స్ జగన్‌ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్‌ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా? అని సీఎం వైయ‌స్ జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, యెల్లో మీడియా వీళ్లంతా ఏకం అయ్యి నా మీద యుద్ధానికి దిగారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఉన్నారు. వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్‌ చూస్తుంటే వైయ‌స్ జగన్‌ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ వైయ‌స్ జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. వారి యెల్లో పత్రికలైతే.. వారి యెల్లో టీవీలు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని సీఎం వైయ‌స్ జగన్‌ భావోద్వేగంగా పేర్కొన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైయ‌స్ఆర్‌సీపీ నిర్వహించిన సిద్ధం ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జగన్‌ ప్రసంగించారు.

సిద్ధమా..!సిద్ధమా..!

మరో చరిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంత సిద్దమా

ఇంటింటి చరిత్రను పేదింటి భవిష్యత్తును, మర్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా..పేదలను కాటేసే ఎల్లో వైరస్ మీద యుద్ధానికి, మహాసంగ్రామానికి నా కుటుంబసభ్యులైన నా అక్కచెల్లెమ్మలు, నా సోదరులు, నా అవ్వతాతా… మీరంత సిద్ధమా

రామాయణము మహా భారతం ఈ రెండింటిలో ఉన్న విలన్లు చంద్రబాబు రూపేణ, ఎల్లో మీడియా రూపేణ, దత్తపుత్రుడి రూపేణ, చంద్రబాబుకోవర్టులు రూపేణ తోడేళ్లంత ఏకమై రెడీ అవుతున్నారు. వారి వైపు నుంచి ఈ సీన్ చూస్తే జగన్ ఒంటరి వాడుగా కనిపిస్తాడు… నిజమేమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రజాసముద్రమే నిజం… ఇది అసలైన సీన్.. ఇన్ని కొట్ల మంది హృయాల్లో మీ జగన్ కి స్థానిమివ్వటం నిజం.. జగన్‌ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే..వారి ఎల్లో పత్రికలు అయితే, వారి ఎల్లో టీవీలైతే..నాకున్న తోడు ఏంటో తెలుసా? నా తోడు ..నా «ధైర్యం..నా బలం..పైనున్న దేవుడు, మీ గుండెల్లో పెట్టుకున్న మీరంతా నా బలం. ఇది నాయకుడిపై ఉన్న నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఇక్కడ కనిపిస్తున్న నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు సైన్య కనిపిస్తుంది. జరుగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోష్తి..అర్జునుడి నేను..మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలు. మనమంతా కూడా కౌరవ సైన్యంపై యుద్ధం చేస్తాం. మన సంక్షేమంపై, మనం చేస్తున్న మంచిపై, అభివృద్ధిపై వారు యుద్ధం చేస్తున్నారు. మన ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి మంచి చేస్తున్నాం..పేదవాడి భవిష్యత్‌ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామ గ్రామ అభివృద్ధిపై వారు దాడి చేస్తున్నారు.
ఈ రోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచన చేయండి. మన ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంపైన, పోర్టులు, మెడికల్ కాలేజీలు, పారిశ్రామిక మౌలిక అభివృద్ధిపై టీడీపీ దండయాత్ర చేస్తోంది. ఆలోచన చేయండి.
చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రలు, కుతంత్రాలను చీల్చి చెండాడటానికి మన సైన్యం, మన కేడర్, నా కుటుంబ సభ్యులంతా కూడా సిద్ధమేనా?

మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈ రోజు గోదారి సీమలో నిలబడ్డాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామాన మనం తెచ్చిన వ్యవస్థ..చరిత్రలో ఎప్పుడూ జరగని సామాజిక న్యాయం..వీటన్నింటికి మనందరి ప్రభుత్వమే కేరాఫ్‌ అడ్రస్‌..ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగిరేసి చెప్పుకునేలా తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175 కు 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలిచేందుకు వివరించేందుకు ఇక్కడికి మీ వాడిగా వచ్చాను.

చంద్రబాబు ఏం చేశాడో ప్రతి ఇంట్లో అడగండి

ప్రతి ఇంటికి వెళ్లి మనం చేసిన మంచిని పంచుకోండి. ప్రతి ఇంటికి వెళ్లి అడగండి..1995లో చంద్రబాబు సీఎం అయ్యాడు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. మీ ఇంటికిగానీ, మీ ఊరికి గానీ, మీ సామాజిక వర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్‌కు ఏమీ చేశాడని ప్రతి ఇంట్లో అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్లుగా వారి బ్యాంకు ఖాతా వివరాలు వారినే చూడమని అడగండి. చంద్రబాబు ఐదేళ్లు, మీ బిడ్డ జగన్‌ పాలనలో ఐదేళ్లు..మొత్తం పదేళ్ల బ్యాంకు ఖాతాల వివరాలను గమనించమని కోరండి.
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి ఇచ్చింది ఎంత అని అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన పథకాలు చంద్రబాబు హయాంలో ఏమున్నాయో అడగండి. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా నా అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో వేశాడా అని వారినే అడగండి. చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యాడు..టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో అడగండి.

ఈ 57 నెలల్లో డీబీటి ద్వారా నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి రూ.2,55,000 కోట్ల వేశాం.. అందులో 75శాతం నా ఎస్సీ, నాఎస్టీ, నాబీసీ అందించి దేశ చరిత్రలో పేదల పట్ల త్రికర్ణశుద్ధిగా ప్రేమ చూపింది జగన్.. వీరికి మంచి జరిగింది మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.. ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నాం. కేబినేట లో 68శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. అక్కచెల్లెమ్లలను లక్షాధికారులను చేయాలని ఏకంగా అక్కచెల్లమ్మలకు 31 లక్షల భూమి పట్టాలు ఇచ్చింది మీ జగన్ ప్రభుత్వంలోనే..

ఈ రోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, కొత్తగా నాలుగు పోర్టులు కడుతున్నాం, కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, ఎయిర్ పోర్టులు, పరిశ్రామనికారిడార్ లో మన రాష్ట్రానికి వచ్చాయి… ఇవన్ని జరిగింది మన వైసీపీ వచ్చిన తర్వైతే.. ప్రతి ఇంటికి ఈ వాస్తవాలను తీసుకుని వెళ్లి చెప్పండి. 2019లో ఏ ప్రభుత్వమైన కూడా ఇది ఆసాధ్యమని చెప్పిన పనులన్ని కూడా మన సాధ్యం చేశాం. అసాధ్యమని చెప్పినవన్ని జరుగుతున్నాయంటే దానికి కారణం వైసీపీ.. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎలాంటి లంచాలకు తావులేకుండా, కులం, పార్టీ చూడకుండా నేరు పేదవాడికి అందించటం సాధ్యంకాదంటే జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికి చూపించాం. ఎన్నికలప్పుడు పెద్ద పెద్ద మేనిఫేస్టోలను రిలజ్ చేసి ఎన్నికలు అవ్వగానే చెత్తబుట్టలో పడేస్తారు. మొట్టమొదటిసారిగా మేనిఫేస్టోకి ప్రజలకు చూపించి వారి చిక్కటిచిరునవ్వులు మధ్య వారి ఆశీస్సులు తీసుకుంటున్న పార్టీ మన వైయస్ఆర్ సీపీ. ఇవన్ని కనిపిస్తున్న కూడా కళ్లు ఉంటి ఈర్ష్యతో చూడలేని కబోదులు… చూడలేకపోతున్నారు.. ఇటువంటివారు ఎం అంటున్నారో వింటున్నారు కదా.. అబద్ధాలపునాది మీద వారి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు.. ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని ఎన్నుకోవటం కాదు.. ఈ ఎన్నికలు పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించున్న ఎన్నికలు.. ప్రతి అవ్వాతాత, ప్రతి రైతన్న భవిష్యత్తు, ప్రతి ప్రాంతం భవిష్యత్తు అన్ని ఈ ఎన్నికలతో ముడి పడి ఉన్నాయి. భవిష్యత్తులో పింఛన్ పెరగాలన్న, ఇంటికి సంక్షేమం అందాలన్న, ఇంటి దగ్గరకే వైద్యం చేరలన్నా మీ బిడ్డ ప్రభుత్వం రావాలి.. ప్రతి ఇంట్లోనుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి.. జరుగుతున్న మంచి జగనన్న ఉంటేనే సాధ్యమని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. మళ్లి జగనన్న ప్రభుత్వమే రావాలి ఒటు వేయమని చెప్పండి.

ఈ మంచికి కొసాగింపుకు మద్ధతు 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరు 124సార్లు బటన్ నొక్కాడు.. జగనన్న సారి కేవలం రెండుసార్లు బటన్ నోక్కలేమా అని ప్రతి ఇంటికి చెప్పండి.. ప్రతిపక్షాలకు ఒటు వేయమంటే ఈ స్కీంల రద్దుకు ఆమోదమని ప్రతి ఇంటికి చెప్పండి. మళ్లి లంచాలు, వివక్షలు, జన్మభూమిని బ్రతికింటమేనని ప్రతి ఇంటికి చెప్పండి. ఆ ఇంటికే పింఛన్, ఆ డీబీటీ రావాలన్న జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మీ జగనే సీఎం అవ్వాలి.. దానికి కోసం మీరంత ఒటు వేయాలి. మీ జగనన్న తోడేళ్ల మద్ధతు లేదు, అబద్ధాలు చెప్పటం రాదు, మోసం చేయటం తెలీదు అని చెప్పండి. ఒక అసెంబ్లీకి , ఒకటి పార్లమెంట్ ఫ్యాన్ మీద నోక్కితే ఇక శాశ్వతంగా చంద్రముఖ బెడత ఉండదు.. చంద్ర గ్రహణాలు ఉండవు.. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది.. పేదల రక్తం తాగేందుకు ఇంటింటింకి ఒక డ్రాకులా మదిరిగా ప్రతి ఇంటికి వస్తారు.మరో విషయం గమనించండి.. 14 ఏళ్లు సీఎంగా చేసిన కూడా పోత్తులు, జిత్తులు, నక్క జిత్తులు గా సాగుతుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమి లేక పోత్తులు, జిత్తులుగా రాజకీయం చేస్తున్నాు.తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా… అంటున్నారు.. చంద్రబాబు పిలిచేది ప్రజల్నికాదు.. దత్తపుత్రుడిని పిలుస్తున్నాడు, ప్యాకేజీ కోసం రా కదలి రా అని పిలుస్తున్నాడు.. వదినమ్నని పిలుస్తున్నారు.. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ, రాజశేఖర్ రెడ్డికి నమ్మకద్రోహం చేసిన పార్టీని పిలుస్తున్నాడు.. వీరిలో ఏ ఒక్కరు మన రాష్ట్రంలో ఉండరు.. వారందరు నాన్- రెసిడెంట్ ఆంధ్రస్.. వారికి ప్రజలతో పని పడినప్పుడు మాత్రమే రాష్ట్రం గుర్తువస్తుంది.. కాబట్టే సైకిల్ తోక్కటానికి ఇద్దరిని, దానిని తోయటానికి రా కదలి రా అని పిలుస్తున్నాడు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గేట్ గా, పేదవారి భవిష్యత్తే టార్గేట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. వీరితో యుద్ధానికి నేను సిద్ధం.. మీ సిద్థమా అని అడుగుతున్నా.. ఈ యుద్దం 15 ఏళ్లగా నాకు అలవాటే.. ప్రజలకు ఇచ్చిన మాటమీద నిలబడ్డ ఒక్కడి మీద వంద బాణాలు వేస్తున్నారు.. ప్రజల పార్టీ వైసీపీ.. కనిపిస్తున్న జెండాకు అర్ధం.. ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా పది వ్యవస్థలు ప్రయోగిస్తే ఎజెండా మన జేండా.. వంద బాణాల్ని,కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రాన్ని ఎదుర్కునేందుకు మీరంత సిద్ధమా అని అడుగుతున్నా.. మీ అన్నని అభిమానించే ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి ఒక్కటే చెబుతున్నా,.. ఇది మీ అందరి పార్టీ.. మీ జగన్ మీ బిడ్డ మీ అందరికి మంచి సేవకుడు.. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా 56 కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మెన్లు, డైరక్టర్ గా పదవులు ఇచ్చింది మీ జగనన్న మాత్రమే…మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లగా మనతో పాటు పనిచేస్తా ఉన్నారు. ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని విధంగా పదవులను ఇచ్చాం.

మంచి పాలన అందించాం.. ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం.. ఎక్కడ లంచాలు, వివక్షలు లేకుండా ఇవ్వగలగుతాం అని చెప్పి చేసి చూపించగలిగాం.. భవిష్యత్తులో ఇంతకన్నా మనవారికి పదవులు ఇచ్చే పార్టీ వైసీపీ అని చెప్పటానికి గర్వపడుతున్నా.. ఈ రోజు వ్యక్తిగతంగా ఒకటి విషయం చెబుతున్నా.. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తగా అండగా ఉంటా.. ప్రతి సేవకుడికి ఒకటే చెబుతున్నా.. మంచి సేవ చేయండి.. మీ వంతు కృషి చేయండి.. మీలో ప్రతిఒక్కరికి మరో రెండు మెట్లు ఎక్కే ఆవకాశం కల్పించే బాధ్యత నాదు అని చెబుతున్నా.. వచ్చే ఎన్నికల్లో మన టార్గేట్ 175కి 175.. 25 ఎంపీలకు 25 మన టార్గెట్.. పరిపాలనలో మనం ఎక్కడ తగ్గలేదు.. కాబట్టి ఒక్క సీటు కూడా తగ్గటానికి వీలు లేదు.. ఈ లక్ష్యానికి చేరుకునేందుకు గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరితో ఒటు వేయించేందుకు సీద్ధామా.. సంక్షేమపథకాల రద్దుకు జరిగే యుద్దన్ని గెలిచేందుకు మీరు సిద్దమా.. బాబు కుతంత్రాలను చిత్తు చేసేందుకు మీ సెల్ ఫోన్.. సోషల్ మీడియాలో కూడా సిద్ధంగా ఉన్నారా? మన ఎల్లో మీడియా తోడు ఉండకపోవచ్చు, దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, మనతోడు పైనున్న దేవుడు, మంచి జరిగిన ప్రతి ఇళ్లు మనకి తోడు.. రాబోయే ఎన్నికలకు మీరంత సిద్ధమా..!మరో మూడు నెలల్లో ఇంతకు మించిన ఉత్సాహంతో మన ప్రభుత్వం కోలువుతీరనుంది