జూలై 7, 2026

WhatsApp Image 2024 02 03 at 7.28.34 PM

TRINETHRAM NEWS

కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు.

You cannot copy content of this page