
— సబ్సిడీ వేరు సెనగ విత్తనాల పక్కదారి పై ఆరోపణలు.
- రైతువేదికల నుండి పంపిణీ చేసిన విత్తనాలు మిల్లులకు చేరుతున్నాయన్న
ఆరోపణలు.
–రైతుల నుండి డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తున్నది ఎవరు?
పర్యవేక్షించాల్సిన అధికారుల జాడ ఎక్కడ?
సమగ్ర విచారణ చేపట్టాలని రైతుల డిమాండ్.
Diversion of Subsidized : చందంపేట నవంబర్ 09, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై వేరు సెనగ(పల్లి) విత్తనాలు పక్కదారి పడుతున్నాయని దేవరకొండ నియోజకవర్గం లోని చందంపేట మండలం లో చర్చనీయాంశంగా మారింది. రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాలు కొందరు మధ్యవర్తుల ద్వారా గోదాములకు మిల్లులకు చేరుతున్నాయనే సమాచారం వెలుగులోకి వస్తుంది, రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న విత్తనాలను తమ వ్యవసాయ అవసరాలకు వాడకుండా ఇతరులకు విక్రయిస్తున్నారని ఆరోపణలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చందంపేట మండలంలో ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన వేరు సెనగ విత్తనాలు రాత్రి వేళల్లో మిల్లులకు తరలిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విత్తనాలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నారా లేక పంపిణీ ప్రక్రియలోనే మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తున్నాయా అని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
—సబ్సిడీ విత్తనాలు విక్రయిస్తున్నారా…?
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను కొందరు రైతులు సాగుకు ఉపయోగించకుండా డబ్బుల కోసం పిల్లలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి రైతుల వివరాలు కొనుగోలు చేసిన వ్యక్తులు తరలించిన విత్తనాల పరిమాణం లావాదేవీలపై అధికారిక నిర్ధారణ జరగాల్సి ఉంది.
అర్హులైన రైతులకు పంపిణీ చేసిన విత్తనాలు నిజంగా సాగుకు వినియోగం అవుతున్నాయా లేదా అనే అంశాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe