నవంబర్ 5, 2026
TRINETHRAM NEWS
Alumni Reunion

Alumni Reunion : డిండి (గుండ్లపల్లి) నవంబర్ 04 త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా, డిండి మండల కేంద్రానికి చెందిన 1990-1991 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ లోని తుర్కయంజల్ లోని తులిప్ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను , అనుభూతులను పంచుకున్నారు. గత స్మృతులను ఒకరికొకరు పంచుకొని అభినందించుకున్నారు. తదనంతరం పూర్వ ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అలనాటి ఉపాధ్యాయులు అబ్దుల్ రజాక్, వీ శేఖర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పూర్వ విద్యార్థులు వేణుగోపాల్ చిలుకూరి పాండు, ఇంద్రారెడ్డి ,షకీల్, వెంకటయ్య, జగన్నాథం కిషోర్ ,వెంకట్ రెడ్డి సలయ్య, వి జ్యోతి లక్ష్మి, వి శోభ ,ప్రభావతి ఇందిరమ్మ ,వసంత , సాజీద బేగం, పద్మ ,కల్పన తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page