
Janasena : ఆ పదవి జనసేనకు దక్కుతుందా ?Alliance Candidates Submit Nomination : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 23; పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో 9 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించారు. అయితే ముందుగా బర్రింకలపాడు లోని శాసనసభ్యుల కార్యాలయం నుంచి కూటమి నాయకులు కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరారు.
అనంతరం జీలుగుమిల్లి ప్రధాన కూడలికి చేరుకుని జగదాంబ అమ్మవారిని చిర్రి బాలరాజు అభ్యర్థులతో కలిసి సందర్శించారు. అక్కడి నుంచి తీన్మార్ డప్పుల నడుమ ఉత్సాహంగా ర్యాలీగా జీలుగుమిల్లి ఎంపీడీవో కార్యాలయానికి సంబంధిత అధికారులకు అభ్యర్థులు జీలుగుమిల్లి కారం సుజాత, కామయ్యపాలెం సో దేం విజయ కుమారి, వంక వారి గూడెం కుంజారాంబాబు, తాటి ఆకుల గూడెం జాస్తి హేమ, రాచన్న గూడెం వెన్నం మాధవి, అక్కన్నగూడెం జమ్మి గోపి, ములగలంపల్లి వనమా శాంతి, దర్భ గూడెం పద్దం వెంకట కృష్ణ నామినేషన్ పత్రాలను వాళ్లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గడ్డం మునుగు రవికుమార్, పసుపులేటి రాము, సుంకవల్లి సాయి, బండారు అనిల్ కుమార్, ఉండవల్లి సోమసుందరం, జాస్తి సత్యనారాయణ, సూరిశెట్టి మహేష్, గుడపాటి పుల్లయ్య, గుడపాటి అరుణ్ కుమార్, పానుగంటి శ్రీను, నాలి శ్రీను, సంకుల రామకృష్ణ, గూడెల్లి లక్ష్మీనారాయణ, కోర్స దుర్గారావు, తమ్మన సాంబ, చాపా రవి, మరీదు కొండయ్య, పండు, నారాయణ, కుంజా రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, కిరణ్, రాయి సుబ్బారావు, వనమా రాంబాబు, చప్పిడి హరికృష్ణ, చిర్రి శ్రీను, కోలా మధు, రూపా సత్యనారాయణ, కొప్పుల శ్రీకాంత్, సొంటి రామకృష్ణ, కక్కిరాల శ్రీను, సాదు చెన్నారావు, మందపాటి సూర్య, పేరుబోయిన దాము, భరగడ రాజు, మద్దాల రమేష్, దేవుడు శ్రీను తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe