నవంబర్ 10, 2026
TRINETHRAM NEWS
blessings  Goddess Durga.

–దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

Blessings Goddess Durga : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 18, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ దుర్గామాత అనుగ్రహాన్ని పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవరకొండ పట్టణంలోని మార్కండేయా ఆలయంలో,పాత రామాలయంలో,1వ వార్డులో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ దుర్గామాతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శరన్నవరాత్రి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు దేశంలో ఎక్కడ ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగలను ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకుంటారని అన్నారు. మన పూర్వీకులు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ పండుగలను సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మికతను పెంపొందించేలా రూపొందించారని ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను చూస్తే అర్థమవుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాజులఆంజనేయులు,అర్వపల్లి నర్సింహ, మద సుధాకర్ గౌడ్, వంగల కృష్ణా రెడ్డి, వేముల రాజు, పొట్ట మధు,ముత్యాల రవి కుమార్,వనం జగదీశ్వర్,రమావత్ దామోదర్, మకాం చంద్రమౌళి,పగిడిమర్రి నాగరాజు,పగిడిమర్రి సతీష్,ముదిగొండ హరిదాస్,వల్లసాని వెంకన్న,శేరిపల్లి జయలక్ష్మి,తదితరులు ఉన్నారు.

“ఈ దీపావళికి మీ ఇంటికి లక్ష్మీ, గణపతి, సరస్వతి దేవుళ్ల అనుగ్రహాన్ని తెచ్చుకోండి! చరణ్ పాదుకతో కూడిన ARNAVIRA గోల్డ్ ప్లేటెడ్ పాకెట్ టెంపుల్—పండగ పూజలకు మరియు గిఫ్టింగ్ కోసం ఒక దివ్యమైన ఎంపిక. ఇప్పుడే కొనుగోలు చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి.”

You cannot copy content of this page