
MLA Consoles Family : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 25 : కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామానికి చెందిన జనసైనికుడు, పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు వీరాభిమాని నులకాని సుధాకర్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పొంగుటూరులోని సుధాకర్ నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రూపాయలు50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా కల్పించారు.ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని, కష్టకాలంలో వాళ్లకు తోడుగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడివో, ఎమ్మార్వో మిగిలిన అధికారులు మరియు కూటమి నాయకులు పారెపల్లి రమేష్, కొప్పుల రాజేష్, మారిశెట్టి అనిల్, శివకుమార్, చిరంజీవి, కొప్పుల శ్రీకాంత్, వామిశెట్టి మధు, పూనెం రాజా, మారిశెట్టి సాయి మణికంఠ,తదితరులు పాల్గొన్నారు.

జీవిత సత్యాలు, ధైర్యం మరియు మనశ్శాంతిని ప్రసాదించే పవిత్ర గ్రంథం ‘శ్రీమద్ భగవద్గీత’ తెలుగు పుస్తకాన్ని అమెజాన్ నుండి ఇక్కడ ఆర్డర్ చేయండి.