సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Best Teachers

Best Teachers : డిండి( గుండ్లపల్లి) సెప్టెంబర్ 22, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మండలంలో పనిచేస్తున్న 8 మంది ఉపాధ్యాయులు జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందడం మండలానికి గర్వకారణమని, ఇది భవిష్యత్తులో మండల విద్యాశాఖ మరింత ఉత్సాహంతో పనిచేయడానికి దోహదపడుతుందని మండల విద్యాధికారి పగిడిపాటి నర్సింహ ఆకాంక్షించారు.
ఈ అవార్డులు కేవలం అలంకారానికే పరిమితం కాకుండ భవిష్యత్తులో ఉపాధ్యాయుల బాధ్యతను పెంచడానికి ఉత్సాహాన్ని నింపాయని ఆశాభావం వ్యక్తం చేశారు..
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారిలో పగిడిపాటి నరసింహ,(కామేపల్లి) టీ బ్రహ్మచారి (గోనబోయనపల్లి) ఇస్లావత్ గోపియా నాయక్ (చెరుకుపల్లి), పి యాదయ్య (కందుకూరు) , హరిలాల్ (టీ గౌరారం), కే ,శ్యామ్ సుందర్ (టీ జీ ఎం ఎస్ డిండి), జీ రామారావు, (ఎం పి పి ఎస్ డిండి),జె, సరిత ( ఎర్రారం) తదితరులు ఉన్నారు. మండల విద్యాశాఖ పక్షాన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఉపాధ్యాయులందరికి మండల విద్యాధికారి పగిడిపాటి నరసింహ శుభాకాంక్షలు తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page