సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Free Training

–అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి .
– జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..

Free Training : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 18, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో త్వరలో నిర్వహించనున్న పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో పోటీ పడుతున్న నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన 500 మంది నిరుద్యోగ యువతి, యువకులను ఎంపిక చేసి, నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో వారికి ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు పోలీస్ నియామక పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన శారీరక దారుఢ్య శిక్షణ (ఫిజికల్ ట్రైనింగ్), రాత పరీక్షకు సంబంధించిన సిలబస్‌పై బోధన, మాక్ టెస్టులు, పరీక్షా విధానంపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఎంపికైన అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

అనుభవజ్ఞులైన శిక్షకులు, నిపుణుల ఆధ్వర్యంలో అభ్యర్థులకు క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తూ, రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఈవెంట్లలో కూడా మెరుగైన ప్రతిభ కనబరిచేలా అభ్యర్థులను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు కింది గూగుల్ ఫామ్ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు: https://forms.gle/Ha8ZK33Y1emVCKmx6

అలాగే ఎస్‌ఐ/కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్న Part-I Application Form ప్రతిని వెంట తీసుకురావాలని సూచించారు.

అభ్యర్థులు తేది 20-09-2026 ఆదివారం ఉదయం 9.00 గంటలకు ముందుగానే క్రింది కేంద్రాల్లో సంబంధిత సబ్‌ డివిజన్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని,స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలనీ జిల్లా ఎస్పీ సూచించారు.

  • నల్లగొండ సబ్‌ డివిజన్ అభ్యర్థులు: ఎన్‌.జి. కళాశాల, నల్లగొండ
  • మిర్యాలగూడ సబ్‌ డివిజన్ అభ్యర్థులు: మీనా ఇంజినీరింగ్ కళాశాల, మిర్యాలగూడ
  • దేవరకొండ సబ్‌ డివిజన్ అభ్యర్థులు:కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మీనాక్షి సెంటర్స్, డిండి క్రాస్ రోడ్

నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో శిక్షణ పొంది పోలీస్ ఉద్యోగం సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆకాంక్షించారు.

ఏదైనా సందేహలు ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో వివరాలు అడిగి తెలుసుకోగలరని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page