
PGRS : అరకులోయ ఆగస్టు 28, (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పర్యటన ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమై ఉన్నందున, నేడు నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంతి టి, తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వివిధ శాఖల సమన్వయ కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమై ఉన్న కారణంగా పీజీఆర్ఎస్ నిర్వహణ సాధ్యంకాలేదని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ నిశాంతి టి, విజ్ఞప్తి చేశారు. తదుపరి నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe